రేపు సంచలన నిర్ణయం తీసుకుంటా – జగ్గారెడ్డి

-

రేపు సంచలన నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటన చేశారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పిన అనే అవేదనలో తాను ఉన్నానని.. పార్టీ అంతర్గత అంశాలు మీడియా లో మాట్లాడనని మాటిచ్చానని పేర్కొన్నారు. కానీ రేవంత్ వ్యవహారం వల్లనే మాట తప్పావని… పార్టీ చీఫ్ కి రాజకీయ వ్యూహం ఉండాలని తెలిపారు.

తెలంగాణ లో పార్టీ కి నష్టం జరిగితే నా పై నిందలు మోపే ప్రమాదం ఉందని.. చంద్రబాబును తెలంగాణ కనుమరుగు చేసింది ఓటుకు నోటు కేసు అన్నారు. రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం దీనికి కారణమని… పార్టీ నడిపే నాయకుడికి వ్యూహం ఉండాలన్నారు. కానీ రేవంత్ కి అది లేదని విమర్శించారు.

తొమ్మిదేండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడిగా ఉన్నపుడు ఓటు కు నోటు కేసు లో రేవంత్ రెడ్డి రాజకీయ అతి ఉత్సాహంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ లో రాజకీయంగా కనుమారుగైపోయిండు.ఈ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండి కూడా లేన్నట్లుగానే జీవిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news