ష‌ర్మిల పార్టీ పేరు ఇదే.. ఆమోదించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

-

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమ‌ర్శ‌లు చేస్తున్నారు ష‌ర్మిల‌. ముఖ్యంగా నిరుద్యోగ‌లు స‌మ‌స్య‌ల‌ను బేస్ చేసుకుని విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ పెట్టి, ఆ త‌ర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష‌.. ఇలా వ‌రుస‌గా హంగామా చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా పెద్ద‌గా బ‌య‌ట తిర‌గ‌ట్లేదు. అయితే త‌న తండ్రి పుట్టిన‌రోజునాడు త‌న పార్టీ పేరును, జెండాను ప్ర‌క‌టించ‌నున్నారు.

అయితే ఇప్ప‌డు ష‌ర్మిల పార్టీ పేరు బ‌ట‌య‌కు వ‌చ్చింది. భార‌తీయ ఎన్నికల సంఘం వద్ద షర్మిల త‌న పార్టీ పేరును రిజిస్ట‌ర్ చేయించారు. త‌న తండ్రి పేరుమీద అయితేనే సింప‌తీ ఉంటుంద‌ని అనుకున్నారు. అందుకే ఆయ‌న పేరుమీద‌నే పార్టీ పెట్టారు.

త‌న పార్టీ పేరును వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా నిర్ణయించారు ష‌ర్మిల‌. ఈ పేరు మీద‌నే రీసెంట్‌గా ఎన్నికల సంఘం వ‌ద్ద రిజిస్టర్ చేయించారు ఆమె. ఈ పార్టీకి భార‌తీయ ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరును వైఎస్సార్ టీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ పార్టీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా ఉండ‌నున్నారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే పార్టీ ప్లాన్ అమ‌లు చేస్తారు ష‌ర్మిల‌.

Read more RELATED
Recommended to you

Latest news