బ్రేకింగ్: డ్రగ్స్ కేసు, తెలంగాణా హైకోర్ట్ కీలక ఆదేశాలు

-

మూడేళ్ళ క్రితం తెలంగాణాలో డ్రగ్స్ కేసు ఏ రేంజ్ లో సంచలనం అయిందో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ముందు అడుగు పడింది ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాని కి హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకి సంబంధించి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎంపీ రేవంత్ రెడ్డి 2017 లో పిల్ దాఖలు చేసారు.

High-court-for-state-of-Telangana-at-Hyderabad

ఈ పిల్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. అంతర్జాతీయ ముఠాల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని రేవంత్ రెడ్డి హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని పిల్ లో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. రేవంత్ రెడ్డి తరుపున రచనా రెడ్డి వాదించారు. దర్యాప్తునకు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచన రెడ్డి హైకోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈడీ, ఎన్ సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని ఆమె వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10 లోగా తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news