Big Breaking : ప్ర‌ధాని కీల‌క నిర్ణ‌యం : వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వెన‌క్కి

-

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కీలక నిర్ణ‌యం తీసుకున్నాడు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పై కేంద్రం వెన‌క్కి తగ్గింది. ఈ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన్కిక్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌కటించారు. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు జాతిని ఉద్ధేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఈ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల పై కీల‌క నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మూడు చ‌ట్టాల‌ను రైతుల కోసమే తీసుకువ‌చ్చిన‌ట్టు తెలిపారు. కానీ త‌మ ప్ర‌భుత్వం ఈ మూడు చ‌ట్టాల గురించి దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు వివ‌రించ‌లేక పోయింద‌ని ప్ర‌ధాని మోడీ అన్నాడు.

అయితే గ‌త కొద్ది నెల‌ల నుంచి ఈ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని దేశ రాజ‌ధాని ఢిల్లీ లో రైతులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఇన్ని రోజుల కు వారి డిమాండ్ నేర‌వేరింది అని చెప్పాలి. కాగ ఈ రోజు సిక్కుల ప‌విత్ర దినం. ఈ రోజు మొద‌టి సిక్కు గురువు గురునాన‌క్ జయంతి. అయితే సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్యమం చేస్తున్నారి లో అధిక సంఖ్య లో సిక్కులో ఉండ‌టం తో గురునాన‌క్ జ‌యంతి రోజు ఈ నిర్ణయం తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. అయితే త్వ‌ర‌లో పంజాబ్ తో పాటు ప‌లు రాష్ట్రాల‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగుత‌న్నాయి. ఎన్నికల నేప‌థ్యం లోనే ప్ర‌ధాని మోడీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ప‌లువురు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version