గ్రేటర్: సిట్టింగ్ లకు తెరాస అధిష్టానం షాక్

20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం తెరాస పార్టీ విడుదల చేసింది. రెండో జాబితాలో ఆరుగురు సిట్టింగ్ కార్పొరేటర్ల కు షాక్ ఇచ్చింది పార్టీ. బాలానగర్ కొండేటి నరేందర్ స్థానంలో రవీందర్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చింది. వివేకానంద నగర్ లో లక్ష్మీ భాయ్ స్థానంలో రోజా రంగ రావు కు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అడ్డగుట్టలో విజయ కుమారి స్థానంలో ప్రసన్న లక్ష్మీ కి చోటు కల్పించింది.

మెట్టుగూడలో భార్గవి స్థానంలో సునీతకు అవకాశం ఇచ్చారు. బౌద్ధ నగర్ లో ధనుంజన భాయ్ స్థానంలో కంది శైలజకు అవకాశం ఇచ్చారు. బేగంపేట లో ఉప్పల తరుని స్థానంలో మహేశ్వరి శ్రీహరికి అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఐదుగురు సిట్టింగ్ లకు మరో ఛాన్స్ ఇచ్చింది. 4 ఎంఐఎం, 1బీజేపీ సిట్టింగ్ డివిజన్లుగా ఉన్నాయి. మైలార్ దేవర్ పల్లి సిట్టింగ్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం తో ప్రేమ్ దాస్ కు అవకాశం ఇచ్చారు.