రాష్ట్ర ప్ర‌భుత్వం బియ్యాన్ని ఎగుమ‌తి చేయాలి – ఉత్త‌మ్

తెలంగాణ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం విష‌యం లో రైతుల తో ఆడుకుంటున్నాయ‌ని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బియ్యాన్ని ఎగుమ‌తి చేసే అవ‌కాశం ఉన్నా.. ఎందుకు అలా చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించాడు. తెలంగాణ ప్ర‌భుత్వం వరి ధాన్యం కంటే బియ్యాన్ని ఇత‌ర రాష్ట్రాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని డిమాండ్ చేశాడు.

అలాగే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రాథ‌మిక బాధ్య‌త ను విస్మ‌రించి ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌ని మండి ప‌డ్డాడు. అలాగే రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి వ‌రి వ‌ద్దు అని.. ఫామాయిల్ పంట వేయాలని చెబుతున్నాడ‌ని అంటున్నార‌ని అన్నాడు. అయితే ఫామాయిల్ పంట లాంగ్ ట‌ర్మ్ పంట అని అన్నారు. అప్ప‌టి వర‌కు రైతుల ఎం చేయాల‌ని అన్నారు. వ‌రి ధాన్యం పై ఆంక్ష‌లు పెట్ట‌డం స‌రి అయిన నిర్ణ‌యం కాద‌ని అన్నారు. ఈ విష‌యం లో రైతు ల‌కు అండ‌గా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ పంట కొనుగోలు పై మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు.