కేసీఆర్ సర్కారు కు గ్రీన్ ట్రిబ్యునల్ షాక్..

కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్. సచివాలయం నిర్మాణం విషయంలో ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది ఎన్జీటీ.  చెన్నై బెంచ్ హరిత ట్రిబ్యునల్ సచివాలయ నిర్మాణం కోసం పర్యవరణ అనుమతులు తీసుకోకపోవడంపై సీరియస్ అయింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేశారని.. అనుమతులు లేకుండా కొత్త  నిర్మాణాలు చేపట్టారని రేవంత్ రెడ్డి పిటీషన్ వేశారు. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారోలేదో చెప్పాలని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తోంది. దీని కోసం పాత సచివాలయాన్ని కూల్చింది. ఈ విషయంపై అప్పట్లో ప్రతిపక్షాల తీవ్రంగా విమర్శించాయి. దీనిపై హై కోర్ట్ లో కేసులు కూడా దాఖలు అయ్యాయి. ముఖ్యం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టగా సచివాలయ నిర్మాణ పనులను చూస్తున్నారు. వివిధ శాఖలకు అనువుగా ఉండటంతో పాటు భవిష్యత్ అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని నిర్మాణం చేసున్నారు.