పరీక్షలపై మరోసారి ఆలోచించండి

ఓ వైపు దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర తరమవుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసాయి. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కరోనా విజృంభిస్తున్నప్పటికీ పది, ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అన్ని జాగ్రత్తల మధ్య పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న వేళ ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల లాగా పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దని అంటున్నాయి. ఇక పరీక్షలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసారు. కాగా ఈ పిటిషన్ పై శుక్రవారం ఏపీ హై కోర్టు విచారణ జరిపింది. పరీక్షల అంశంపై పునరాలోచన చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న ధర్మాసనం.. కేంద్రం నిబంధనల ప్రకారం వారు ఐసోలేషన్‌ లేదా ఆస్పత్రిలో ఉండాలి కదా అని ప్రశ్నించింది. పరీక్షలంటే.. 30 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారని దీనిపై ఆలోచించాలని పేర్కొంది. ఇతర రాష్ట్రాలుపరీక్షలు రద్దు చేశాయని, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేసిన న్యాయస్థానం… జరిపింది. పరీక్షల అంశంపై పునరాలోచన చేయాలని సూచించింది. ఇక దీనికి సంబంధించి మే3లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.