గాంధీని చంపిన వారే కాల్పులు జ‌రిపారు : అస‌దుద్దీన్ ఒవైసీ

-

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పై కాల్పులు జ‌రిగిన విషయం తెలిసిందే. కాగ కాల్పులు ఘ‌ట‌న త‌ర్వాత ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ శ‌నివారం తిరిగి ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆయ‌న శ‌నివారం భాగ‌ప‌త్ జిల్లా లో ప‌ర్య‌టించి ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో త‌న పై జ‌రిగిన కాల్పుల పై స్పందించారు. అప్ప‌ట్లో మ‌హ‌త్మ గాంధీని హ‌త్య చేసిన వారే.. ఈ రోజు త‌న‌పై కాల్పులు జ‌రిపి హ‌త్య ప్ర‌య‌త్నం చేశార‌ని ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు.

త‌న‌పై ఆ రోజు నాలుగు రైండ్ల కాల్పులు జ‌రిగాయ‌ని అన్నారు. త‌న‌ను చంపాల‌ని ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. కానీ తాను సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డాన‌ని అన్నారు. కాగ యూపీలో ప్ర‌చారం లో ఉండ‌గా ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ పై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. అనంత‌రం వారు తీసుకువ‌చ్చిన గ‌న్ ల‌ను అక్క‌డే విడిచిపెట్టి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఒవైసీకి జ‌డ్ కేట‌గిరి భ‌ద్ర‌త ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

కానీ త‌న‌కు ఎలాంటి భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌ని ఒవైసీ పార్ల‌మెంట్ లో ప్ర‌క‌టించారు. కాగ ఒవైసీ పై కాల్పులు జ‌రిపిన ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి బీజేపీ తో సంబంధాలు ఉన్నాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై లోతుగా ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news