ప్రధాని కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొనకపోవడంలో తప్పులేదు : కేంద్ర హోం శాఖ

-

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే.. దేశ ప్రధాని పర్యటన నేపథ్యంలో… కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌.. పాల్గొనాల్సిందే. కానీ చివరి క్షణంలోనే.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు.. తాను పర్యటనకు రాలేనంటూ సీఎం కేసీఆర్‌ చాలా చాక చక్యంగా తప్పించుకున్నారు. అయితే.. ఈ వివాదంపై బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. అటు దీనిపై టీఆర్ఎస్‌ పార్టీ క్లారిటీ కూడా ఇచ్చింది.

అనారోగ్యం కారణంగానే సీఎం కేసీఆర్‌ ఎయిర్‌ పోర్టు కు వెళ్లలేకపోయారని పేర్కొంది. అయితే.. ప్రధాని ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే.. సీఎం వెళ్లాల్సిన అవసరమే లేదని.. కూడా తేల్చి చెప్పింది. కేంద్ర హోం శాఖ ప్రోటోకాల్‌ సైతం ఇదే చెబుతోందని.. క్లారిటీ ఇచ్చింది.

దీనిపై బీజేపీ పార్టీ నేతలు రాజకీయ చేయడం తగదని.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి ఘటనలపై చవకబారు రాజకీయాలు చేయొద్దని బీజేపీ నేతలకు హితువు పలికింది. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది కూడా వాస్తవమే. ప్రైవేట్‌ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటే.. ఈ కరోనా సమయంలో.. సీఎం వెళ్లాల్సిన పని లేదని.. హోం శాఖ తన జీవోల్లో ఇప్పటికే పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news