అండర్ -19 వరల్డ్ కప్ లో యంగ్ టీమిండియా దుమ్ములేపింది. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయదుందిబి మోగించింది. దీంతో అండర్-19 ప్రపంచ్ కప్ ను రికార్డు స్థాయిలో ఐదు సార్లు కైవసం చేసుకున్న జట్టుగా భారత్ నిలిచింది. కాగా ఈ వరల్డ్ కప్ లో యశ్ ధుల్ సేన ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి పాలు కాలేదు.
ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ.. కప్ కొట్టి టోర్నీని విజయ వంతంగా ముగించింది. అయితే.. 5వ సారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా జట్టుకు.. ప్రత్యేక అభినందనలు తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా . ఈ నేపథ్యంలోనే… టీమిండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ.. రూ.40 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. ఇలాగే విజయదుందిబి కొనసాగించాలని ఆయన కోరారు.