మునుగోడులో ‘కారు’కు ముప్పు…!

-

రోజురోజుకూ అధికార టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ తప్ప…పాజిటివ్ పెరుగుతున్నట్లు కనిపించడం లేదు..ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్..మూడో సారి కూడా అధికారంలోకి రావాలని చూస్తుంది. సీఎం కేసీఆర్ ఆ దిశగానే రాజకీయం నడిపిస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఉన్నకొద్ది నెగిటివ్ పెరుగుతుందే తప్ప…పాజిటివ్ ఏం ఉండటం లేదు. అదే సమయంలో బీజేపీకి పాజిటివ్ పెరుగుతుంది.

ఇక ఈ నెగిటివ్‌ని తగ్గించుకోవడానికి కేసీఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు..ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటి మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు…దానికి కంటే ముందు మునుగోడు ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారు. కానీ మునుగోడులో టీఆర్ఎస్‌కు అనుకున్నంత పాజిటివ్ కనిపించడం లేదు. గత ఎన్నికల్లోనే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది…అయితే ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలుపు అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

ఇక్కడ మరోసారి అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పెట్టాలని అనుకోవడమే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్‌లా కనిపిస్తోంది…ఆయన్ని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ బలం ఇంకా పెరుగుతూ వస్తుంది. కానీ ఎలాగోలా అధికార బలాన్ని ఉపయోగించుకుని ఇక్కడ గెలవాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఎంత అధికార బలాన్ని వాడిన సరే…మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక రాజకీయమే నడుస్తోంది.

ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మునుగోడులో నామినేషన్లు వేసేందుకు దిండి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు రెడీ అవుతున్నారు. అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా నామినేషన్లు వేస్తామని అంటుంది. ఇక ఉద్యమ సమయంలో గజ్జకట్టి, డప్పుకొట్టి ప్రజలను చైతన్యం చేసిన 300 మంది కళాకారులు సైతం నామినేషన్స్ వేయనున్నారని తెలిసింది. వీఆర్ఏ జేఏసీ సైతం మునుగోడు బరిలో ఉంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది

మొత్తానికి చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్‌లో కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్స్ వేశారు. ఆ దెబ్బ వల్ల టీఆర్ఎస్ ఓడిపోయింది..ఇప్పుడు మునుగోడులో నామినేషన్స్ వేస్తే కారు మునగడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news