వినాయక చవితి నాడు ఏ విఘ్నలూ రాకుండా ఉండాలని వినాయకుడికి హిందువులు పూజిస్తారు. వినాయకుడి పూజ చేసే విధానంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని యదావిధిగా అనుసరిస్తుంటారు. అయితే వినాయక చవితి నాడు ఐశ్వర్యం కలగాలని ఎలాంటి ఆటంకాలు పనుల్లో రాకూడదని పూజ చేసి వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా ఇస్తూ ఉంటారు.
అలానే పత్రితో పూజ చేసి వినాయకుని కథ చదివి అక్షింతలు వేసుకుంటారు. అయితే వినాయక చవితి పూజ విషయంలో కూడా చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మీరు పూజ చేసేటప్పుడు ఈ తప్పులు లేకుండా చూసుకోండి. ఏదైనా తప్పు జరిగితే దాని ప్రభావం మన మీద పడుతుందని తప్పులు చెయ్యకుండా ఉండండి.
వినాయకుని పూజ చేసేటప్పుడు వినాయకుడికి ఇష్టమైన వస్తువులని పదార్థాలను పెట్టాలి కానీ తులసిని పూజ చేయకూడదు. తులసి వినాయకుడి పూజకు నిషేధించబడింది అని తెలుసుకోండి. గణపతికి ఇష్టమైన గరికను ఆరోజు పెట్టొచ్చు.
మీరు వినాయకుడికి పూజ చేసేటప్పుడు విగ్రహం ఈశాన్యం వైపు ఉంచి పూజ చేయండి. విగ్రహం పగిలిపోకుండా చూసుకోవాలి. పగిలిన విగ్రహాలతో పూజ చేయకూడదు. విగ్రహాలను ఎంపిక చేసుకునేటప్పుడు అందులో మూషికం ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే వినాయకుడి వాహనం మూషికం కనుక.
అలానే ఆరోజు ఎలుకల్ని చంపకూడదు, బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా పూజచేసేటప్పుడు భగవంతుడిని మనస్ఫూర్తిగా కొలవాలి మొక్కుబడిగా కాదు. పూజ సమయంలో కోపంగా ఉండడం ఇతరులను దూషించటం వంటివి చేయకూడదు వినాయక చవితి నాడు పూజ సమయంలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.