త్వరలో ఏపీకి మూడు జిల్లాలు…?

-

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా వాటిని 16 జిల్లాలు చేసేందుకు సిద్దమవుతుంది. దీనికి రాష్ట్ర మంత్రి వర్గ ఆమోదం కూడా లభించినట్లు సమాచార౦. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం ని ఒక జిల్లాగా, గుంటూరు జిల్లాలో ఉన్న గురజాలను ఒక జిల్లాగా విశాఖ జిల్లాలో ఉన్న అరకుని ఒక జిల్లాగా చేయనున్నారు.

ఈ మూడు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెడికల్ కాలేజి ఏర్పాటు చెయ్యాలి అంటే 600 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చెయ్యాలి అంటే ఏర్పాటు చెయ్యాలి అంటే దానికి అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) అందిస్తుంది. మూడు కాలేజీలకు 1800 కోట్లు ఖర్చు అవుతుంది.

అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 720 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఉన్న అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేయొద్దని భావిస్తున్న ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చే వచ్చే డబ్బుల కోసం వాటిని జిల్లాలుగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ముందు 25 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి కొత్త జిల్లాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news