ఉమ్మడి కూటమిలో నిరసన జ్వాలలు… డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లంటూ ఆరోపణ..

-

ఏపీలో ఉమ్మడి కూటమిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. భారీగా డబ్బులు ఖర్చు చేయించి.. తీరా టికెట్ ఇచ్చే సమయానికి అధిష్టానం మొండి చేయి చూపించిందని ఆ పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. వ్యాపారాలు చేస్తూ.. ఇంట్లో కూర్చుని డబ్బు మూటలతో దిగి, లాబియింగ్ చేసిన వారికే టికెట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

టీడీపీ తమకు తీరని అన్యాయం చేసిందని.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఏ పాపం చేశానని టికెట్‌ కేటాయించలేదని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చెప్పారు. నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తానని బండారు వారికి హామీ ఇచ్చారు.

మరోవైపు చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరతీసి అవినీతి అనకొండ గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్‌ ఇచ్చారని కోరాడ రాజబాబు ధ్వజమెత్తారు. పార్టీని పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకున్న గంటాకు టికెట్‌ ఇవ్వడం ఏమి సంప్రదాయమని ప్రశ్నించారు. వేలంలో టికెట్లు అమ్ముకోవాలనుకుంటే చంద్రబాబు ఒక రేటు పెడితే తాను కూడా టికెట్‌ కొనుక్కునేవాడినని విమర్శించారు. చంద్రబాబు టీడీపీ నాయకుల తన గొంతుగోశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news