జ‌న‌సేన ఆఫీస్ ఖాళీ… టు లెట్ బోర్డు పెట్టేశారు..

-

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీ  చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. జ‌నసేన ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కం అవుతుంద‌ని కొంద‌రు  అంటే… ఆ పార్టీ అభిమానులు అయితే తామే అధికారంలోకి వ‌స్తామ‌ని నానా హంగామా చేశారు. మ‌రికొంద‌రు మాత్రం కీల‌క స్థాయిలో సీట్లు గెలుచుకుని క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌లో కీ రోల్ ప్లే చేస్తామ‌ని చెప్పారు. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.


తీరా ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ప‌వ‌న్ సొంతంగా పోటీ చేయ‌లేక బీఎస్పీతో పాటు ఉభ‌య క‌మ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. చివ‌ర‌కు ఈ రెండు పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్నా ప‌వ‌న్ హిందూపురం లాంటి ఎంపీ సీటుకు పోటీ కూడా పెట్ట‌లేని ప‌రిస్థితికి దిగ‌జారిపోయాడు. పార్టీ అధ్య‌క్షుడి హోదాలో గాజువాక‌, భీమ‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసినా గెల‌వ‌లేదు. చివ‌ర‌కు ఒక్క రాజోలు సీటుతో మాత్ర‌మే జ‌న‌సేన స‌రిపెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు జ‌న‌సేన పార్టీ ఆఫీస్ కూడా ఖాళీ అయిపోతోంది. గుంటూరు నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న జనసేన కీలక కార్యాలయం ఖాళీ అయింది. ఎన్నికల ముందుకు ఆర్భాటంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఆఫీస్‌ను ఎత్తేశారు. రెంట్లు క‌ట్టేందుకు కూడా పార్టీ నేత‌లు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం, అటు పార్టీ అధిష్టానం నుంచి డ‌బ్బులు రాక‌పోవ‌డంతో ఈ కార్య‌లయం బాగోగులు ప‌ట్టించుకునే నాథుడే లేడు.

దీంతో పార్టీ ఆఫీస్ ఖాళీ చేసి భవనాన్ని తిరిగి యజమానికి అప్పగించారు. కానీ భవనంపై ఏర్పాటు చేసిన జనసేన, పవన్ కళ్యాణ్ బొమ్మలు మాత్రం అలాగే ఉన్నాయి. మరొకరికి భవనాన్ని అద్దెకు ఇచ్చే పనిలో యజమాని ఉన్నారు. ఇందుకోసం భవనం ముందు టులెట్‌ బోర్డును ఏర్పాటు చేశారు.ఈ భవనాన్ని బార్‌ అండ్ రెస్టారెంట్‌ కోసం అద్దెకు ఇస్తామని టులెట్‌ బోర్డు పెట్టారు. ఈ ఒక్క ఆఫీసే కాదు ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌సేన ఆఫీసుల‌న్నింటిని మూసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news