ఈ సారి తెలంగాణలో కొన్ని స్థానాల్లో ముక్కోణపు పోరు జరిగేలాగా కనిపిస్తుంది. గత మూడు ఎన్నికల నుంచి తెలంగాణలో ముక్కోణపు పోటీ జరుగుతూనే ఉంది. ఈ సారి కూడా అదే తరహాలో పోరు జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే కొన్ని స్థానాల్లోనే ఆ పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రధాన పోరు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతుంది. ఇక కొన్ని స్థానాల్లో బిజేపి బలంగా ఉండటం వల్ల..త్రిముఖ పోరు జరుగుతుంది.
అలా త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో ముధోల్ నియోజకవర్గం కూడా ఒకటి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఇప్పుడు బిఆర్‌ఎస్ హవా ఉంది. 2004లో ఇక్కడ బిఆర్‌ఎస్ గెలిచింది..2009లో టిడిపి గెలిచింది. ఇక 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వరుసగా గెలిచింది. బిఆర్‌ఎస్ నుంచి విఠల్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి ఆయనకు కాస్త టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అది బిజేపి, కాంగ్రెస్ నుంచి గట్టి ఫైట్ ఉంటుంది.
2014, 2018 ఎన్నికల్లో అలాగే ఫైట్ నడిచింది. మొదట స్థానంలో బిఆర్‌ఎస్, రెండోస్థానంలో బిజేపి, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటూ వస్తుంది. ఇక వరుసగా రెండు సార్లు బిజేపి లో ఓడిపోయిన రమాదేవిపై సానుభూతి ఉంది. అటు కాంగ్రెస్ నుంచి నారాయణరావు పటేల్, ఎన్‌ఆర్‌ఐ విజయ్ కుమార్ రెడ్డి సీటు ఆశిస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ కూడా ఇక్కడ బలపడింది. అయితే ప్రస్తుత పరిస్తితుల్లో బిఆర్‌ఎస్‌కు మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది. మళ్ళీ కాంగ్రెస్, బిజేపిల మధ్య ఓట్లు భారీగా చీలితే బిఆర్‌ఎస్‌కు ప్లస్..అలా కాకుండా రెండు పార్టీల మధ్యే పోటీ నడిస్తే బిఆర్‌ఎస్ గెలుపు కష్టం. చూడాలి మరి ఈ సారి ముధోల్ ఎవరు దక్కించుకుంటారో.