హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ప్లాన్‌ విఫ‌లం.. ఆ నేత బీజేపీలోనే..

-

రోజు రోజుకూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఘ‌రం ఘ‌రం అవుతున్నాయి. రోజుకో మ‌లుపుతో హోరెత్తుతోంది. తెలంగాణ రాష్ట్ర‌మంతా ఇప్పుడు హుజూరాబాద్ వైపే చూస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు దాదాపు అన్ని ముంద‌స్తుగానే అనేక వ్యూహాలు ర‌చించుకుంటున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నేతలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోడానికి టీఆర్ఎస్ అనేక ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగా కొంత‌వ‌ర‌కు అయితే టీఆర్ఎస్ విజ‌య‌వంత‌మైంది. ఎల్‌. రమణ, పాడి కౌశిక్ రెడ్డి వంటి ముఖ్య నేతలను టీఆర్ఎస్ కారెక్కించారు. మ‌రోవైపు బీజేపీలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కూడా టీఆర్ఎస్‌లోకి లాగాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

cm-kcr
cm-kcr

బీజేపీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న పెద్దిరెడ్డికి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి రావడతో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. తనను సంప్రదించకుండానే ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై ఆయ‌న గుర్రుమీద ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఆ కోపంతోనే ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాద‌ని అనుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఇంకో ట్విస్టు ఏంటంటే ఈ విష‌యాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంది. బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన విద్యాసాగర్ రావును రంగంలోకి దింపారు. పెద్దిరెడ్డిని శాంతించేలా చేశారని బ‌య‌ట టాక్‌. పెద్దిరెడ్డితో మాట్లాడిన విద్యాసాగర్‌రావు.. హుజూరాబాద్‌కు బదులుగా ఆయనకు మరో నియోజకవర్గాన్ని ఇస్తాన‌ని మాటిచ్చాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్‌కు బదులుగా హుస్నాబాద్‌ను పెద్దిరెడ్డికి ఇస్తాన‌ని చెప్పినట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనికి సంబంధించి పార్టీ నుంచి హామీ ఇప్పించేందుకు కూడా తాను సిద్ధమ‌ని విద్యాసాగ‌ర్‌రావు చెప్పాడ‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల టాక్‌.

విద్యాసాగర్‌రావు రంగంలోకి దిగ‌డం వ‌ల్లే ఆయ‌న బీజేపీలో కొన‌సాగుతాడ‌ని తెలుస్తోంది. మరో నియోజకవర్గం కేటాయిస్తామని హామీ ఇవ్వడం మూటంగానే పెద్దిరెడ్డి వెన‌క్కి త‌గ్గాడ‌ని అనుకుంటున్నారు. విద్యాసాగ‌ర్ రావు రంగంలోకి దిగ‌డం వ‌ల్ల‌నే టీఆర్ఎస్‌లోకి వెళ్లాలనే నిర్ణయాన్ని పెద్దిరెడ్డి విర‌మించుకున్నాడ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే పెద్దిరెడ్డి నిర్ణయం మార్చుకున్నాడా లేద‌నేది ఇంకా ర‌హ‌స్యంగానే ఉంది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెల‌వ‌డానికి హుజూరాబాద్ చుట్టూ ఉన్న ముఖ్య నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు స్కెచ్‌లు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news