తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకు వచ్చిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇంకా హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది. మొన్నటి దాకా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చుట్టూ తిరిగిన ఫోకస్ ఇప్పుడు మళ్లీ ఈటల రాజేందర్ మీదవకు వచ్చేసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన చేసిన వ్యాఖ్యలు హల్ చల్ కావడంతో పాటు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇప్పడు మరోసారి ఆయన సీఎం కేసీఆర్ మీద చేసిన కామెంట్లు దురమారం రేపుతున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు నానా తంటాలు పడుతున్న ఈటల రాజేందర్ ఎంతోమందికి అధికారం కట్టబెట్టిన పాదయాత్రను నమ్ముకుని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాగా ఈటల పాదయాత్ర చేస్తే గెలిచే ప్రమాదం ఉందని ఆయన్ను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ పరకాల ఎమ్మెల్యేతో కుట్ర చేస్తున్నారంటూ జోరుగా ఆరోపనలు మొదలయ్యాయి.
తాను పాదయాత్ర చేసేందుకు అన్ని విధాలుగా పర్మిషన్ తీసుకున్నానని, కానీ తాము మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గంలోని ఓ రైస్ మిల్లులో జరుగుతున్న ఏర్పాట్లను అడ్డుకున్నారని వివరించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అయిన చల్లా ధర్మారెడ్డికి చెందిన అనుచరులు ఆ రైస్ మిల్ యజమానులను బెదిరించి తాము ముందుగానే ఏర్పాటు చేసుకున్న తమ వంట సరుకులను సీజ్ చేయించారని ఇది కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందని చెప్పారు. కావాలనే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు.