ఉప్పు ఎక్కువగా తింటున్నారని చెప్పే సంకేతాలు..

-

సాధారణ జీవనంలో పడిపోయి తీసుకునే ఆహారంలో నిర్లక్ష్యం చేయడానికి సమంజసం కాదు. ముఖ్యంగా ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరిగి అది గుండెపోటుకు కారణం కావచ్చు. అందువల్ల ఉప్పు తీసుకోవడాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మరి మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? దానికోసం మీ శరీరం కొన్ని సంకేతాలను చూపిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కువ దాహం

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అందులోని సోడియం కారణంగా తరచుగా దాహం వేస్తుంది. శరీర నిర్జలీకరణ స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.

ఉబ్బరం

ఎక్కువ ఉప్పు మిమ్మల్ని ఉబ్బరానికి గురి చేస్తుంది. ఎక్కువ నీళ్ళు శరీరంలో ఉండడం వల్ల ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటిబరువు పెరుగుగుతుంది కాబట్టి ఉబ్బినట్టుగా అనిపిస్తారు.

తరచుగా తలనొప్పి

తలనొప్పి తరచుగా వస్తుంటే, అదీగాక నొప్పి తీవ్రస్థాయిలో ఉన్నట్లయితే అది ఉప్పు ఎక్కువగా తినడం వల్లే అయి ఉంటుందని గ్రహించాలి. సోడియం బ్యాలన్స్ తప్పిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి.

శరీర భాగాల్లో వాపు

ఉప్పు నీటిని నిలిపి ఉంచుతుంది కాబట్టి శరీర భాగాల్లో వాపు ఏర్పడుతుంది. అది కొన్ని సార్లు నొప్పులకు దారి తీయవచ్చు. అవయవాలు బిగుతుగా మారడం లేదా సంచిలాగా వేలాడుతున్నట్లు మారడం మొదలగునవి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలుగుతాయి.

తిమ్మిర్లు, నొప్పులు

ఎక్కువ ఉప్పు కారణంగా శరీరంలో కాల్షియం మీద ప్రభావం పడుతుంది. దానివల్ల ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంది. తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా వచ్చే ప్రమాదమూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news