ఒకప్పటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు పార్టీ, వ్యక్తుల ప్రభావాన్ని బట్టి తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పే అవకాశం ఉండేది. కానీ ఇది అప్ డేట్ యుగం. ఇప్పుడు జనాన్ని ఆకర్షించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొత్తగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా గతంలో జరిగినట్టు జరుగుతుందని ఆశిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి రెండు దఫాలుగా తెలంగాణలో అధికారంలో లేకపోయే సరికి ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీనియర్లు వ్యతిరేకించినా కూడా ఢిల్లీ అధిష్టానం మాత్రం రేవంత్‌రెడ్డినే పార్టీ రథసారథిగా నియమించింది. అయితే ఆయన బీజేపీ లాగా ఇప్పటి పరిస్థితులను క్యాచ్ చేసుకోకుండా గతలంఓ లెక్కలను వల్లె వేస్తున్నారు.
గతంలో ఏ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా పదేళ్లు పాలించిన తర్వాత ఓడిపోయాయని, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా 2023 వరకు అధికారంలో ఉండి ఆ తర్వాత ఓడిపోతారంటూ గతంలో జరిగిన వాటిపై ఆధారపడుతున్నారు. ఇవే ఆయన అభిమానులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. బీజేపీ లాగా పోరాటాలు చేసి లేదా జనం తరఫున మాట్లాడి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దూకుడా వ్యవహరించకుండా ఇలా మాట్లాడటం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ చల్ల బడుతున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.