కారు వర్సెస్ కమలం…ఎవరు ‘తగ్గేదేలే’!

-

తెలంగాణలో కారు, కమలం మధ్య వార్ ఆగేలా లేదు. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఎప్పటికప్పుడు పెరుగుతుందే తప్ప…తగ్గేదేలే అన్నట్లు పరిస్తితి ఉంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీజేపీ చెక్ పెట్టిందో అప్పటినుంచే రెండు పార్టీల మధ్య పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత మరింత ముదిరింది. ఇక బీజేపీ తమకు పోటీగా వచ్చేస్తుందని టీఆర్ఎస్‌కు సీన్ అర్ధమైంది. అందుకే డైరక్ట్‌గా కేసీఆర్, బీజేపీపై ఎటాక్ మొదలుపెట్టారు.

bjp-trs
bjp-trs

ఈ క్రమంలోనే ధాన్యం అంశంలో రాజకీయం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య రచ్చ నడుస్తోంది. అయితే దీని రాజకీయంగా ఉపయోగించుకుని బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా కూడా మరింత దూకుడుగా ఆయన రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అలాగే బీజేపీ నేతలని నియోజకవర్గాల్లోకి రానివ్వకుండా తరిమికొట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ సూచనలు చేశారు.

అదేవిధంగా తాజాగా రాష్ట్రంలో చావుడప్పు పేరుతో టీఆర్‌ఎస్‌ నేతలు కార్యక్రమం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలు చావు డప్పు నిర్వహించారు. అలాగే కొందరు మంత్రులని ఢిల్లీకి పంపించారు. ధాన్యం అంశంపై కేంద్రంతో మాట్లాడటానికి టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు.

అదే సమయంలో కేసీఆర్‌కు రివర్స్‌లో కౌంటర్లు ఇవ్వడానికి బీజేపీ కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. అలాగే వారు అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక చావుడప్పు అంశంపై బండి సంజయ్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్‌.. చావు డప్పు కొట్టించడం తప్పు అని, ఆయన ఎప్పుడూ ఎదుటివారి చావునే కోరుకుంటారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఆందోళనల్లో పాల్గొనడానికి డబ్బులిచ్చి మనషులను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇక అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మరింత దూకుడుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news