టీఆర్ఎస్ఎల్పీ మీట్.. ముందస్తుకు మళ్ళీ రెడీ?

-

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య పోరు తీవ్రంగా జరుగుతుంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి రెండు పార్టీలు గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నాయి. ఇక మునుగోడు ఉపఎన్నికలో బి‌జే‌పికి చెక్ పెట్టిన కే‌సి‌ఆర్..ఇంకా రానున్న రోజుల్లో బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా రాజకీయాన్ని మరిన్ని మలుపులు తిప్పడానికి రెడీ అవుతున్నారు.

ఇదే క్రమంలో ముఖ్యమైన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ రేపు జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు…పార్టీ ప్రధాన నేతలతో కే‌సి‌ఆర్ భేటీ కానున్నారు. ఈ భేటిలో పలు కీలక అంశాలని చర్చిండానికి కే‌సి‌ఆర్ రెడీ అవుతున్నారు. మొదట బీజేపీపై పోరు, ఐటీ, ఈడీ దాడులకు భయపడకూడదని,ఒత్తిళ్లకు లొంగకూడదని నేతలకు కే‌సి‌ఆర్ సూచించనున్నారు. అలాగే జాతీయ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ ద్వారా బి‌జే‌పిపై పోరాటం చేయడం, కమ్యూనిస్టులపై పొత్తు కొనసాగింపు లాంటి అంశాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఈ భేటీ నేపథ్యంలో మరొకసారి ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అనేకసార్లు మళ్ళీ కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బి‌జే‌పి నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ టి‌ఆర్‌ఎస్ మాత్రం ముందస్తుకు వెళ్ళడం లేదని చెప్పుకొచ్చింది. ఇలా జరుగుతుండగానే రేపు టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో కే‌సి‌ఆర్..ముందస్తు ఎన్నికలకు సంబంధించి పరోక్షంగా నేతలకు సూచనలు చేస్తారని ప్రచారం జరుగుతుంది.

గతంలో ఎలాగో ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అయ్యారు…మరోసారి కూడా కే‌సి‌ఆర్ అదే ఫార్ములాతో ముందుకెళ్లాలని భావిస్తున్నారట. కాకపోతే గతంలోనే పార్టీ ముఖ్య నేతలు ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసారు. కానీ, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ప్రధానితో సహా బీజేపీ నేతలంతా తెలంగాణలో అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో, ముందు గానే ఎన్నికలకు వెళ్లటం ద్వారా టీఆర్ఎస్‌కు కలిసి వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ముందస్తుకు వెళితే లాభం ఏంటి, నష్టం ఏంటి అనే అంశాలపై కే‌సి‌ఆర్ లెక్కలు వేసుకుంటున్నారట. కాకపోతే ముందస్తు గురించి ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లోనే ఉండాలని కే‌సి‌ఆర్ సూచించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ముందస్తుపై ముందస్తు గానే రచ్చ ఆగేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news