పార్టీ మారడానికి రెడీ అయిన తుమ్మల…?

-

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందరికో సుపరిచితం. రోడ్లు భవనాల శాఖా మంత్రిగా ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ స్థాయిలో రోడ్లు వేసి ఆయన అప్పుడు ప్రజలకు రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఆంధ్రప్రదేశ్ ల కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా తొలి ప్రభుత్వంలో చోటు కల్పించారు.

ఆయనకు బాగా నచ్చిన శాఖను అప్పగించి కీలక బాధ్యతలు చేతిలో పెట్టారు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న ఆయన 15 ఏళ్ళు మంత్రిగా రికార్డ్ కూడా సృష్టించారు. ఉమ్మడి ఏపీలో ఆ రికార్డ్ ఎవరికి లేదు. ఆయన ఎవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మలకు ప్రాధాన్యత తెరాస లో టీడీపీ లో కూడా ఎక్కువగానే లభించింది. అయితే ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.

కారణం ఏంటీ అనేది స్పష్టత లేకపోయినా సరే కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన బిజెపిలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చర్చలు కూడా జరపగా పార్టీ మారడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఆయన కరోనా కారణంగా ఆగారని తర్వాత పార్టీ మారడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news