అవును : 58.8 శాతం
కాదు : 41.2 శాతం
ఉగాది నుంచి జగన్ 2.0 పాలన బాగుంటుందా ?@YSRCParty @ysjagan #AndhraPradesh
— Manalokam (@manalokamsocial) March 28, 2022
మే 30,2019 జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు.ఆ రోజుతో జగన్ పాలనకు మూడేళ్లు. ఆ తరువాత ఆయన ఎన్నికలపై దృష్టి సారిస్తారు. అంటే రానున్న రెండేళ్లూ ఆయనకు కీలకం. ఇదే క్రమంలో ఆయన పలు విషయాలపై సమాలోచనలు జరపాల్సి ఉంది కూడా ! ఎందుకంటే పాలన పరంగా జగన్ కు ఎన్ని మార్కులు పడ్డాయి ? ఇంకా ఎన్ని మార్కులు పడాల్సి ఉంది అన్నవి కూడా తేలాల్సి ఉంది.
ఇప్పటిదాకా జగన్ ముఖ్యమంత్రి హోదాలో జనం మధ్య కు వెళ్లిన దాఖలాలు తక్కువ. మంత్రులు కూడా పెద్దగా ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు. అందుకే జగన్ రంగంలోకి దిగి మొన్నటి వేళ చాలా అంటే చాలా సేపు ఎమ్మెల్యేలకూ, ఎంపీలకూ క్లాస్ తీసుకున్నారు. తన వద్ద అందరి జాతకాలూ ఉన్నాయి అని, ఉగాది తరువాత పాలన స్వరూపం మారుతుందని,
జూలైలో వైస్సార్సీపీ ప్లీనరీ నిర్వహణ తరువాత అన్నీ మారిపోతాయి అని కూడా అంటున్నారు.
మంత్రి వర్గంలో మార్పులు అనంతరం కొత్త టీంతో తాను పనిచేయాలని అనుకుంటున్నానని కూడా తెలిపారు. ఇప్పటిదాకా మంత్రులుగా పనిచేసిన వారు ఇకపై జిల్లాలలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని, అదేవిధంగా కొత్త మంత్రులు తనతో పనిచేస్తూనే పాలనలో వేగం తీసుకురావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.దీంతో పాటు ఉగాది నుంచి గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అటుపై ఎమ్మెల్యేలకు సంబంధించి వచ్చిన సర్వే రిపోర్టు అనుసారమే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడమా లేదా అన్నది తేలిపోనుందని చెప్పారు. ఏదేమయినప్పటికీ ఉగాది నుంచి పాలనలో వచ్చే మర్పులుకు అనుగుణంగానే ప్రజాప్రతినిధుల భవితవ్యం అన్నది ఆధారపడి ఉండనుందన్నది సుస్పష్టం.
– ట్విటర్ పోల్ – మన లోకం ప్రత్యేకం