అత్యంత విలువ‌గ‌ల సెల‌బ్రెటీగా కోహ్లి.. వ‌రుస‌గా ఐదో సారి

-

భార‌త దేశంలో అత్యంత విలువ‌గ‌ల సెల‌బ్రెటీ లీస్ట్ లో క్రికెట్ ఆట‌గాడు.. విరాట్ కోహ్లి మ‌రో సారి అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో వ‌రుస‌గా ఐదో సారి విరాట్ కోహ్లి అత్యంత విలువ‌గ‌ల సెల‌బ్రెటీ లీస్ట్ లో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. కాగ సెల‌బ్రెటీల బ్రాండ్ విలువ‌ను లెక్కించే ఒక డ‌ఫ్ అండ్ ఫెల్ప్స అనే సంస్థ తాజా గా భార‌త్ లో ఉన్న అత్యంత విలువ గ‌ల సెల‌బ్రెటీల జాబితను విడుద‌ల చేసింది. ఈ జాబితా లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలు ర‌ణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వ‌రుస‌గా.. 2, 3 వ స్థానాల్లో ఉన్నారు. అయితే అగ్ర స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి బ్రాండ్ విలువ గత ఏడాది కంటే.. 22 శాతం మేర త‌గ్గింద‌ని సెల‌బ్రెటీల బ్రాండ్ విలువ‌ల‌ను లెక్కించే డ‌ఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ తెలిపింది. దీంతో ఈ ఏడాది కోహ్లి 185.7 మిలియ‌న్ డాల‌ర్లు ( అంటే దాదాపు రూ. 1,400 కోట్లు ) గా ఉంది.

రెండో స్థానంలో ఉన్న ర‌ణ్ వీర్ సింగ్ రూ. 1,196 కోట్లు, మూడో స్థానంలో ఉన్న అక్షయ్ కుమార్.. రూ. 1,055 కోట్ల‌తో ఉన్నారు. అలాగే ఇటీవ‌ల టీమిండియా కెప్టెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ‌.. రూ. 243 కోట్ల తో 13వ స్థానంలో ఉన్నాడు. స‌చిన్ రూ. 358 కోట్ల తో 11వ స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని రూ. 462 కోట్ల‌తో ఐదో స్థానంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news