ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి మ‌రో షాక్‌… ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు కూడా…

-

తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాకుల క్ర‌మంలోనే మ‌రో అదిరిపోయే షాక్ త‌గిలింది. ఉత్త‌రాంధ్ర నుంచి ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీలోకి వెళ్లిపోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో కీల‌క నేత సైతం ఇప్పుడు సైకిల్ దిగేసి కారు ఎక్కేశారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం పట్టణాధ్యక్షుడు, జిల్లా కేంద్రాస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వి.ఎస్‌. ప్రసాద్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

కీల‌క‌మైన విజ‌య‌నగ‌రం జిల్లా కేంద్రంలో ఆయ‌న పార్టీలో మంచి ప‌ట్టున్న నేత‌గా పేరొందారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజుకు కొన్నేళ్లుగా రైట్ హ్యాండ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేతలు జిల్లాకి చేసిందేమీ లేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు గత ముప్పై ఐదేళ్లుగా అనేక పదవులు అనుభవించిని స్థానిక సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లా ప్రజలకు ఏం చేయక పోవడం దురదృష్టకరమన్నారు. ఈ క్ర‌మంలోనే బొత్స అశోక్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అశోక్ జిల్లాలో ఏక‌వ్య‌క్తి రాజ‌కీయాలు చేస్తూ కాలం గ‌డిపేశార‌న్నారు. జిల్లాలో రాజకీయంగా మరొకరికి ఎదగడానికి అవకాశాల్లేకుండా చేసి, పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు.

మొత్తం తన రాజకీయ జీవితంలో తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేక పోయారన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత‌, కేఏ.నాయుడు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని.. మాజీ మంత్రి గంటా అనుచ‌ర‌గ‌ణంగా ఉన్న వీరు ఎప్పుడైనా టీడీపీకి షాక్ ఇవ్వ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌న చూస్తుంటే ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీకి వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌ప్పేలా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news