ఏదో అనుకుని ఏదో చేసిన ఉండవల్లి.. జగన్ కి మాత్రం ఫుల్ పాజిటివ్ అయ్యింది !

-

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు తెలుగు రాజకీయాలలో తెలియని వారు ఎవరూ ఉండరు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా చెప్పటంలో, వివరించడంలో, విశ్లేషించడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కి మించిన వారు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో మరొకరు లేరని చెప్పవచ్చు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశంలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు గురించి అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్లు చేస్తుంటారు. Image result for undavalli jagan

ఇదిలా ఉండగా ఇటీవల జగన్ అధికారంలోకి వచ్చాక అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న దాని విషయంలో ఉండవల్లి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువగా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ లెటర్ రాయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఎత్తిచూపుతూ వాటిని సరిదిద్దుకోవాలంటూ లేఖలు రాస్తూ సంచలనాలకు తెరతీస్తున్నారు. ఘాటైన విమర్శలు సర్కార్ పై చేస్తున్నారు. అయితే ఈ విషయాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా చేయకపోవడంతో …ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పార్టీలో లేని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలను ప్రతిపక్ష పార్టీ టిడిపి చేయకుండా ముందుగానే జగన్ ప్రభుత్వం..ఉండవల్లి చేసిన విమర్శలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.

 

దీంతో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాలి అని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రయత్నం ఏదో అనుకుని ఏదో చేసినట్లు అయిందని…ఈ పరిణామం జగన్ కి పాజిటివ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్షం కేవలం మూడు రాజధానులు గురించే ఎక్కువ మాట్లాడుతుంది అది కేవలం 29 గ్రామాలకు సంబంధించిన విషయమని కానీ ఉండవల్లి రాసిన లెటర్ లో చేసిన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ అన్నారు. దీంతో ఒక విధంగా ఉండవల్లి..జగన్ ప్రభుత్వం పై ప్రతిపక్ష పార్టీ టీడీపీ విమర్శ చేయకుండా డిఫరెంట్ చేసినట్లే అయ్యింది అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news