చైనా – భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సైనికులు వీరమరణం పొందారు. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో ఆ దేశ వస్తువులను,యాప్‌లను వాడొద్దనే డిమాండ్ ఊపందుకుంది. చాలా మంది స్వచ్ఛందంగా చైనా పరికరాలను బయటపడేస్తున్నారు. దీనిపై పలువురు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రులు కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సైతం కూడా తన డిమాండ్ వినిపించారు. “చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించాలి. భారత్‌లో సుమారు 15 కోట్ల మంది టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా చైనాకు కోట్లల్లో ఆదాయం చేకూరుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేందుకు భారత్‌లో ఈ యాప్‌ని నిషేధించాలి. ఈ యాప్‌ను ఎవరూ వాడవద్దు” అని ట్వీట్ చేసారు.
టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలి: కేంద్ర మంత్రి
-