లవ్‌ జిహాద్‌పై‌ యూపీ సర్కార్‌ ఆర్డినెన్స్‌..ఆలహాబాద్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో అమలుపై ఉత్కంఠ.

Join Our Community
follow manalokam on social media

బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ సంచలన నిర్ణయం తీసుకుంది..మత మార్పిడలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా యోగీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం బలవంతపు మత మార్సిడి.. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు..అయితే ఇటీవలె అలహాబాద్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్డినెన్స్ అమలు ఎలా ఉండబోతోందనే దానిపై న్యాయ నిపుణుల్లో చర్చ జరుగుతోంది..

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లవ్‌ జిహాద్‌పై‌ జోరుగా చర్చ సాగుతుంది..యూపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆర్టినెన్స్‌ను తీసుకొచ్చింది..ఉత్తరప్రదేశ్‌లో చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్-2020 ప్రకారం..అబద్ధాలతో, బలవంతంతో జరిగే మత మార్పిడులను వివాహ ప్రయోజనం కోసం మాత్రమే జరిగే మత మార్పిడులను నేరంగా ప్రకటిస్తారు. ఈ తరహా కేసుల్లో బెయిల్‌ కూడా మంజూరు చేయరు. ఒకేవళ ఎవరైనా వివాహాం తర్వాత మతం మారాలని భావిస్తే..దాని గురించి రెండు నెలల ముందుగానే జిల్లా అధికారికి తెలపాల్సి ఉంటుంది..లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకోస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించిన యోగి..నెల రోజుల్లోపే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు..ఆర్డినెన్స్ ప్రకారం, మోసం ద్వారా లేదా బలవంతపు మత మార్పిడికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 15 వేల రూపాయల జరిమానా విధిస్తారు. బలవంతపు మత మార్పిడిలో అట్టడుగు వర్గాలకు చెందిన ఒక మహిళ ఉంటే 3పదేళ్ల జైలు శిక్షతో పాటు 25వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సామూహిక మత మార్పిడిలకు పాల్పడితే 3నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో లవ్‌ మ్యారేజీలకు సంబంధించి ఇదే కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను కాదని నిన్న కొత్త తీర్పు ఇచ్చింది అలహాబాద్‌ హై కోర్టు. వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం ఆమోద యోగ్యం కాదంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులను జస్టిస్‌ వివేక్‌ అగర్వాల్‌, జస్టిస్‌ పంకజ్‌ నక్విలతో కూడిన బెంచ్‌ నిన్న కొట్టేసింది. గత సెప్టెంబర్‌లో ఒక తీర్పును, దాని ఆధారమైన 2014నాటి మరో తీర్పును కోర్టు చెల్లదని స్పష్టం చేసింది.అయితే యూపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ఆమోదించడానికి కొన్ని గంటల ముందే ఈ తరహా కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులకు వారికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని, ఇందులో ఎవరి జోక్యం తగదని తెలిపింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 పౌరులకు కల్పించిందని పేర్కొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో యూపీలో ఆర్డినెన్స్‌ అమలు ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది..అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన కొత్త తీర్పు ఇపుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది..

TOP STORIES

బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి....