సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. ఇదిలా ఉంటే… బీజేపీ పార్టీకి మాత్రం భారీ షాక్ తగిలింది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర సిట్టింగ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు. ఈ పరిణామం బీజేపీకి షాక్ తగిలేలా చేసింది. ఖతిమా నియోజవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్.. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ధామి ఓడిపోవడం బీజేపీ పార్టీకి మింగుడుపడటం లేదు. నిజానికి పుష్కర్ సింగ్ ధామి సీఎం పగ్గాలు చేపట్టడంతోనే ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం ఖాయం అయిందని బీజేపీ అగ్రనాయకత్వం అనుకుంటుంది. అయితే.. పుష్కర్ సింగ్ ధామి ఓడిపోతాడని మాత్రం బీజేపీ ఊహించలేదు. ఉత్తరాఖండ్ లో ఉన్న మొత్తం 70 స్థానాల్లో బీజేపీ48 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. దాదాపుగా అధికారాన్ని కైవసం చేసుకోనున్నారు. కానీ సీఎం అభ్యర్థి మాత్రం ఓడిపోయాడు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి హరీష్ రావత్ కూడా లాల్ కాన్ స్థానం నుంచి ఓడిపోయారు. ఇలా ఒకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల సీఎం అభ్యర్థులు ఓడిపోయారు.