జగన్ లానే కేసీఆర్ కి కూడా ఆ తలపోట్లు స్టార్ట్!

-

కరోనా మహమ్మారిని ఎలా రూపుమాపాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నానా పాట్లు పడుతున్న సమయమిది! ఒకపక్క కరోనా.. మరోపక్క ఇన్ కమింగ్స్ లేని ఖజానాతో ఆర్థిక ఇబ్బందులు… ఈ సమయంలో ఏపీలో కరోనా రాజకీయం వేడెక్కిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! తాజా రాష్ట్ర పరిస్థితులను అర్ధం చేసుకుని సలహాలూ, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు… ఎక్కడ పొరపాటు దొరుకుతుందా అని.. దానిపై హడావిడి చేద్దామని చూస్తున్నాయనే విశ్లేషణలూ వినపడుతున్నాయి. కాకపోతే… ఇవి ఇంతకాలం ఏపీలో మాత్రమే ఉండేవి.. కాగా తాజాగా తెలంగాణలోనూ స్టార్ అయ్యాయి!!

అవును.. ఏపీలో 12 గంటల దీక్షలకు టీడీపీ నేతలు దిగుతుండటం… రెగ్యులర్ సమయాల్లో చేసుకున్నట్లుగా రాజకీయ విమర్శలు చేయడం… తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తురాని అఖిలపక్ష సమావేశాలు ఉన్నట్లుండి చంద్రబాబుకు గుర్తుకురావడం… దీనిపై జగన్ ను డిమాండ్ చేయడం తెలిసిందే! ఈ క్రమంలో తెలంగాణలో కూడా బీజేపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీజేపీ ఆఫీసులో 7 గంటల దీక్షకు దిగనున్నారు. రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేస్తున్నానని చెబుతున్న సంజయ్… టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ దీక్షలో డిమాండ్ చేయనున్నారు.

ఇదే క్రమంలో… ఇక్కడ కూడా అఖిలపక్షం వేయాలి, తమ సూచనలు కూడా తీసుకోవాలి అంటూ ముందుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు! కరోనాపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని అయినా మాట్లాడుతున్నారు కాని… సీఎం కేసీఆర్‌ మాత్రం స్థానిక నేతలతో మాట్లాడటం లేదని వీహెచ్‌ మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల సలహాలు తీసుకునే ఆలోచన కేసీఆర్‌ కు లేదని… కేవలం అధికారులు చెప్పే సలహాలకే కేసీఆర్‌ పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! దీంతో… ఏపీలో జగన్ కు ఉన్న హెడేక్సే ఇక్కడ కేసీఆర్ కు కూడా స్టార్ట్ అయ్యయని పలువురు కామెంట్ చేస్తున్నారు!! దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news