సుళ్ళురుపేటలో తెలుగుదేశం పార్టీ ఖాళీ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టిటిడి మాజీ బోర్డు మెంబర్ వేనాటి..

-

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది.. కీలక నేతలందరూ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. సులూరుపేట టిడిపిలో కీలక నేతగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి చంద్రబాబు ప్రవర్తన నచ్చక గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.. ఇటీవల టిడిపికి రాజీనామా చేసిన ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సులూరుపేట నియోజకవర్గంలో బలమైన అనుచర గణం కల్గిన వేనాటి పార్టీ వీడటంతో సులూరుపేటలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు..

చంద్రబాబు నాయుడుకి సమకాలీకుడుగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగారు. ఎస్సీ నియోజకవర్గ కావడంతో ఆయన చెప్పిన వరకే టిడిపి అధిష్టానం టిక్కెట్లు ఖరారు చేసేది.. అందుకు తగ్గట్టుగానే ఆయన కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి టీడీపీ అభ్యర్థులని గెలిపించేవారు.. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారట. ఆయన్ని పట్టించుకోకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గంగా ప్రసాద్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వేనాటి రామచంద్రారెడ్డి మనస్థాపానికి గురయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా వేనాటికి ఒక్క మాట కూడా చెప్పలేదని.. లోకేష్ వల్లే సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్షీణిస్తోందని టిడిపి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎలివేటి సంజీవయ్య రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. మూడోసారి కూడా ఆయనకి సీఎం జగన్ టికెట్ ఖరారు చేశారు.. ఈ క్రమంలో వేనాటి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా వైసీపీ క్యాడర్ చెబుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ బరిలో ఉన్నప్పటికీ.. ఆమెకు జనాలలో ఎలాంటి ఫాలోయింగ్ లేదని.. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు.. నారా లోకేష్ సుళ్లురుపేట నియోజకవర్గ రాజకీయాల్లో మితిమీరిన జోక్యంతోనే సీనియర్ నేతలందరూ వైసీపీలో చేరుతున్నారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కీలక నేతగా ఉన్న వేనాటి రామచంద్రారెడ్డి పార్టీ వీడటం తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బగా సీనియర్ నేతలు భావిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news