ఫోరెన్సిక్స్ ని రంగం లోకి దింపే ఆలోచనలో విజయ్ సాయి రెడ్డి ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ వార్తలు చాలా వైరల్ గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే విధంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట కేంద్ర హోంశాఖ కి లెటర్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లెటర్ రాశారు అన్న దాని గురించి క్లారిటీ రాకముందే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ లెటర్ ని ఆధారం చేసుకుని జగన్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.Nimmagadda Letter Row: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ... ఇటువంటి పరిస్థితుల్లో ఆ లెటర్ కాపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకం, అదేవిధంగా స్థానిక ఎన్నికల టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకంలో తేడా ఉండటంతో వైసిపి సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి కేంద్ర హోంశాఖ కి నిమ్మగడ్డ రాసిన లెటర్ లో ఫోర్జరీ జరిగిందని దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కోరడం జరిగింది. అయితే ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖ రాసిన లెటర్ స్వయంగా తన చేతులతో రాసిందేనని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

 

అయితే ఈ సందర్భంలో టీడీపీ కార్యాలయం నుండి ఈ లెటర్ కేంద్ర హోం శాఖకు వెళ్ళినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని నిమ్మగడ్డ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి అంటున్నారు. అంతేకాకుండా ఆ లెటర్ లో ఉన్నది నిమ్మగడ్డ సంతకం కాదు అని గట్టిగా నమ్ముతున్నా విజయ్ సాయి రెడ్డి .. ఈ విషయం లో ఫోరెన్సిక్స్ ని రంగం లోకి దింపి ఫోర్జరీ విషయం బయటపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ అధికారులు రంగంలోకి దిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరుక్కునే అవకాశం ఉందని ఏపీ రాజకీయాల్లో టాక్. 

Read more RELATED
Recommended to you

Latest news