బీజేపీలో చేరిన ఆ ముగ్గురు ఎంపీలు చంద్రబాబు బినామీలే..!

-

నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్ ను అర్థం చేసుకుంది. బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి ఇక నుంచి.. అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100 శాతం మ్యాచ్ ఫిక్సింగే.. అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డికి ప్రతి రోజు చంద్రబాబుపై ఏదో ఒక ట్వీట్ చేసి విమర్శించడం అలవాటే కదా. తాజాగా బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై విరుచుకుపడ్డారు.

నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్ ను అర్థం చేసుకుంది. బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి ఇక నుంచి.. అంటూ మరో ట్వీట్ చేశారు.

చంద్రబాబు ప్రస్తుతం ఎక్కడున్నారో ఆ పార్టీ నేతలకే తెలియదు

చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్ లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్ లో మాట్లాడి దైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు.. అంటూ మరో బాంబు పేల్చారు.

కేంద్రం నిధులిచ్చినా.. పోలవరాన్ని చంద్రబాబు సగం కూడా నిర్మించలేకపోయారు

సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాలకు నీరందుతోంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేకపోయారు. ఎంతసేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్న సంకల్పమే లేదు.. అంటూ చంద్రబాబుపై ట్వీట్ల రూపంలో విమర్శల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version