విజయసాయి రెడ్డి” గత నాలుగేళ్ళు గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితంగా, ఆయనకు అన్నీ తానై వ్యవహరిస్తూ, అప్పుడు పార్టీలో ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ కి సలహాలు ఇస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. లాబియింగ్ కింగ్ గా కూడా ఆయన్ను తెలుగుదేశం పిలుస్తుంది. అలాంటి విజయసాయి రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబుని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.
వాస్తవం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రక్రియ దాదాపుగా ఆగిపోయే సూచనలే కనపడుతున్నాయి. జగన్ సంకల్పం ఎలా ఉన్నా చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే బిజెపి పెద్దలు, హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగి మూడు రాజధానుల ఆలోచనకు అడ్డుకట్ట వేసాయి. దీనితో విజయసాయి రెడ్డి ఇప్పుడు సరికొత్త వ్యూహంతో చంద్రబాబుకి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. అది ఏంటీ అంటే, విశాఖ పరిపాలనా రాజధాని అనే విషయాన్ని అక్కడి ప్రజలు స్వాగతించారు.
అందుకు తగినట్టు జగన్ కూడా అడుగులు వేసారు. కాని హిందుత్వ సంస్థల ఎంట్రీ తో సీన్ మారింది. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలకు బలంగా చెప్పాలని విజయసాయి రెడ్డి భావిస్తున్నారు. మీ భవిష్యత్తుని చంద్రబాబు నాశనం చేస్తున్నారనే విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని విజయసాయి భావిస్తున్నారు. ఇక తమకు పట్టున్న రాయలసీమకు కూడా ఇదే విషయాన్ని చెప్పాలని ఆయన భావిస్తున్నారు. దీనితో దాదాపు 8 జిల్లాల్లొ చంద్రబాబు విలన్ అవ్వడం ఖాయంగా కనపడుతుంది.