వ‌ర్షాన్ని కూడా వాడేసిన విజ‌య‌సాయిరెడ్డి.. టీడీపీని వ‌ద‌ల‌ట్లేదుగా

ఏపీలో వైసీపీతో టీడీపీకి త‌గ్గ‌పోరు న‌డుస్తోంది. బ‌య‌టే కాదు సోష‌ల్ మీడియాలో కూడా ఈరెండు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా అరెస్టుల ప‌ర్వం, కేసుల‌తో అట్టుడికిన ఏపీలో ఇప్పుడు వాన‌ల ప‌డుతున్నాయి. అయితే దీనిపై కూడా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి (vijaysai reddy) ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ వేశారు టీడీపీపై.

రాష్ట్రంలో ఈసారి వ‌ర్షాలు బాగానే ప‌డుతున్నాయ‌ని, అందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, అత‌డి కొడుకు లోకేష్ రాష్ట్రంలో లేక‌పోవ‌డ‌మే కార‌ణం అంటూ సెటైర్ వేశారు. వారిద్ద‌రూ ప‌క్క‌రాష్ట్రంలో ఉండ‌టం వ‌ల్లే రాష్ట్రంలో ముందే వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని చెప్పారు.

కరువుకు మారు పేరు నారా వారి కుటుంబం అంటూ విమ‌ర్శించారు విజ‌య‌సాయిరెడ్డి. నారా వారు ఇంకో 4 నెలలు ఏపీలో అడుగుపెట్ట‌క‌పోతే వ‌ర్షాలు బాగా ప‌డుతాయంటూ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ పాల‌న‌లో గడచిన రెండేళ్లలాగే ఈ ఏడాది కూడా వ‌ర్షాలు జూన్ లోనే ఊపందుకుంటాయని కౌంట‌ర్ వేశారు. దీంతో ఈయ‌న ట్వీట్‌పై చాలా ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి. ఆఖ‌ర‌కు వ‌ర్షాన్ని కూడా వ‌ద‌ల‌ట్లేద‌ని చాలామంది అంటున్నారు.