‘డీల్ చెయ్యడం నేర్చుకోండయ్యా ‘ వైకాపా ఎమ్మెల్యే కి క్లాస్ పీకిన విజయ్ సాయి రెడ్డి !

-

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. దాదాపు ఈ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో నాలుగు లక్షల జాబులు నిరుద్యోగులకు రావడం జరిగింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుందని జగన్ తెలపడం జరిగింది. ఈ వ్యవస్థ ప్రారంభమైన సందర్భంలో ప్రతిపక్ష నేత మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో గ్రామ వాలంటీర్లు వస్తున్నారని ఇలా అనేక రకాలు చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. Image result for mla bala nagi reddy

అయితే తాజాగా వైసిపి పార్టీ సొంత ఎమ్మెల్యే కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గ్రామ వాలంటీర్ల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే విధంగా గ్రామ వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బహిరంగంగా మీడియా ముందు సీరియస్ అయ్యారు. ప్రజల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం దగ్గర ఐదు వేల రూపాయలు జీతం తీసుకునే ఈ విధంగా గ్రామ వాలంటీర్లు వ్యవహరించటం దారుణమని పేర్కొన్నారు. ఇదే విధంగా కొంతమంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి వాళ్ల పనితనం గురించి అసహనం గా ఉండటంతో ఈ విషయం వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

దీంతో కర్నూలు జిల్లా ఎమ్మెల్యే బాల నాగి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్నారు వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి. మేటర్ లోకి వెళితే గ్రామ వాలంటీర్లు ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారు అని నీ దృష్టికి వచ్చిందో వారి వెనకాల పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టి పథకాల సమయంలో పెన్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చే సమయంలో ప్రజలకు ఇచ్చే లాగా వ్యవహరించండి ఈ విధంగా ‘డీల్ చెయ్యడం నేర్చుకోండయ్యా ‘ అంటూ క్లాస్ తీసుకోవటం జరిగిందట. బహిరంగంగా మీడియా ముందు మనమే తీసుకువచ్చినా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి విమర్శలు చేయటం పార్టీకే నష్టం అని బాల నాగిరెడ్డి కి విజయసాయిరెడ్డి సూచించారట.  

Read more RELATED
Recommended to you

Latest news