ఏపీకి మరో ముప్పు.. వణికిస్తున్న విష జ్వరాలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ఈ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కరోనా..  పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది.  అయితే కరోనాతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఏపీ ప్రజలకు మరో ముప్పు వచ్చిపడింది. శ్రీశైలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో శ్రీశైలం మండల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. శ్రీశైలంలో మొన్నటి వరకు కరోనా కేసులు భయపెట్టగా..ఇప్పుడు విష జ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు.

వారం రోజులుగా వైరల్ ఫివర్ తో స్థానికులు వణికిపోతున్నారు. ఈ వైరల్ ఫీవర్ పై శ్రీశైలం మండల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని స్థానిక డాక్టర్ సోమశేఖర్ ప్రజలకు సూచనలు చేశారు. కర్నూలు జిల్లా విద్యాధికారులకు విషజ్వరాలపై సమాచారం అందించామని పేర్కొన్నారు. మండలంలో ఫాగింగ్ స్ప్రే మరియు బ్లీచింగ్ వేసేందుకు చర్యలు తీసుకుంటామని డాక్టర్ సోమశేఖర్ హామీ ఇచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని.. మనోధైర్యంతో ఎదుర్కోవాలని పేర్కొన్నారు.