పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డు పడిందే ..  అమరావతి వాళ్ళ ప్లానింగ్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది ..?

-

అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలని చేస్తున్న పోరాటానికి పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా కరోనా వైరస్ అడ్డుపడటంతో కాస్త మెత్తబడ్డారు అమరావతి రైతులు. అయితే లాక్ డౌన్ ఎత్తివేయగానే ఎటువంటి ప్లానింగ్ తో రైతులు ప్రభుత్వంపై పోరాడుతారో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. కాగా మరోపక్క ఈ టైంలో ఏపీ ప్రభుత్వం రైతులను దారిలోకి తెచ్చుకోవాలని సరికొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. తాజాగా రాజధాని అమరావతి గ్రామాల్లో ఆర్​-5 జోన్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఆ జోన్ పరిధిలో ఉన్న రైతులతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. దీంతో ఆర్​-5 జోన్ పరిధిలో ఉన్న రైతులు సీఆర్డీఏ అధికారులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.Amaravati Farmers Write to Prez, PM against Jagan Govt's Proposal ...లాక్ డౌన్ అమలులో ఉన్న టైంలో సంప్రదింపులు ఏమిటి అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మాత్రమే తమ డిమాండ్ అభ్యంతరాలు తెలియజేస్తామని రైతులు కరాఖండిగా చెప్పుకొచ్చారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు R5 జోన్ పరిధిలో  ఉన్న రాజధాని గ్రామాలకు వచ్చినా అధికారులను రైతులు అడ్డుకున్నారు. అసలు ఈ టైం లో ఎందుకు రాజధాని గ్రామ ప్రాంతాల్లో కి వచ్చారో లిఖితపూర్వకంగా లెటర్ రాయాలని అధికారులకు రైతులు చుక్కలు చూపించారు.

 

దీంతో ఏం చేయాలో తెలియక ఏపీ సీఆర్డీఏ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయగానే గతంలో కంటే చాలా ఉదృతంగా… కృష్ణాజిల్లా అలాగే చుట్టుపక్కల జిల్లాల రైతులను కలుపుకుని పోయి అమరావతినే రాజధానిగా ఉంచాలని… ఉద్యమాన్ని ఇతర జిల్లాలకు విస్తరించడానికి అమరావతి రైతులు ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క జగన్ ప్రభుత్వం కరోనా వైరస్ టెన్షన్  తగ్గగానే, లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయగానే… విశాఖపట్టణాని కేంద్రంగా చేసుకొని పరిపాలించాలని ఆలోచన చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news