అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నది ఎవరు..? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే..

-

ఎమ్మెల్సీ రేసులో మొదటి వరుసలో ఉన్న అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పెద్దలు హ్యాండ్ ఇచ్చారు.. లాస్ట్ మినిట్ లో ఆయన పేరును తొలగించి మరో వ్యక్తికి ఎమ్మెల్సీ ని కట్టబెట్టారు.. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అంతర్గత పంచాయతీలే అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ రాకుండా దూరం చేశాయని అంతర్గత చర్చల్లో నేతలు మాట్లాడుకుంటున్నారు..

ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ల నామినేషన్ ప్రక్రియ ముగిసింది.. ఈనెల 22న వారిద్దరిని ఎమ్మెల్సీలను పార్టీ అధిష్టానం ప్రకటిస్తుంది.. ఇది కాసేపు పక్కన పెడితే.. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ రాకపోవడంపై పార్టీలో చర్చ నడుస్తోంది.. చివరి నిమిషంలో కేంద్రంలోని పెద్దలు ట్విస్ట్ ఇచ్చారని నేతలు చెబుతున్నారు. అద్దంకి దయాకర్ ప్లేస్ లో పిసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇస్తే.. క్యాడర్ కి భరోసా ఇచ్చినట్లు అవుతుందని.. ఆ దిశగా ప్రయత్నం చేయాలంటూ అధిష్టాననికి తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, కేసి వేణుగోపాల్ వంటి నేతలు సూచించారట..

దీంతో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు తొలగించారని పార్టీలో టాక్ వినిపిస్తోంది.. ఇదే క్రమంలో పార్టీ పెద్దలనుంచి కూడా దయాకర్కు మంచి ఆఫర్ వచ్చిందట.. వరంగల్ లోక్సభ నుంచి ఆయన్ని బరిలోకి దింపుతారని ప్రచారం నడుస్తోంది.. ఒకవేళ సమీకరణాల నేపథ్యంలో ఈ హామీ నెరవేరకపోతే పార్టీలో కీలక పదవే ఇస్తామని అగ్రనాయకత్వం చెప్పిందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ వ్యవహారంపై అద్దంకి దయాకర్ సైతం మౌనంగా ఉన్నారు.. పార్టీకి విధేయులుగా ఉంటానంటూ ఆయన చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news