పవన్ కళ్యాణ్ అన్ని మాటలు అంటున్నా ఎందుకు మాట్లాడట్లేదు…?

ఏపీలో కొంతమంది ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను బలహీన పరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తగా లేకపోవడంతో కొంత మంది ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేయడం ఈ మధ్యకాలంలో సంచలనంగా మారిన అంశంగా చెప్పాలి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కొంత మందికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. వివేకానంద రెడ్డి మరణం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి అని చెప్పాలి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడింది. ఈ విషయంలో వైసీపీ మంత్రులు ఘాటుగా సమాధానం ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

కొంతమంది మీడియా ముందు మాట్లాడుతున్న మరికొంతమంది మాట్లాడలేకపోతున్నారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వైఎస్ సునీత రెడ్డి ఢిల్లీ వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు దానిని ఎక్కువగా హైలెట్ చేస్తూ ప్రజల్లో వ్యాఖ్యలు చేయడం వంటివి ఆసక్తికరంగా మారుతున్నాయి. దీంతో ఏం జరగబోతుంది ఏంటి అనే దానిపై ఇపుడు వైసీపీ నేతలలో కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.