ఏంటీ బాబు గ్రాఫ్ ప‌డిపోతుందా ? సాయిరెడ్డి ర్యాగింగ్ మామూలుగా లేదుగా !

-

విప‌క్ష టీడీపీ విష‌య‌మై వైసీపీ ర్యాగింగ్ మామూలుగా లేదు.ఒక‌ప్పుడు టీడీపీ ఇదే విధంగా జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తే, అదే సూత్రం  అదే ప‌ద్ధతిలో సాయిరెడ్డి పోస్ట‌ర్లు విడుద‌ల చేసి మ‌రీ ! చంద్ర‌బాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. గ‌తం క‌న్నా భిన్న‌గా ఆయ‌న మాట్లాడుతూ ఉన్నారు. క్రియెటివ్ వే లో పోస్ట‌ర్లు డిజైన్ చేసి మ‌రీ! బాబు ఏ విధంగా ఎక్క‌డెక్క‌డ ఏయే సంద‌ర్భాల్లో త‌న ఛార్మింగ్ ను కోల్పోయారో .. ఏ విధంగా కోల్పోనున్నారో అన్న‌ది  కూడా చెబుతూ.. టీడీపీని పున‌రాలోచింపజేస్తున్నారు. ఒక‌ప్పుడు టీడీపీ ఇలాంటి టెక్నిక్సే ఎప్లై చేసేది. కానీ ఇప్పుడిప్పుడే డిజిట‌ల్ వైసీపీ ఆ ప‌నిచేస్తోంది. తెలుగుదేశం త‌ర‌ఫున డిజిట‌ల్ మీడియా ఐ టీడీపీ ఉన్నా అది ఇంకా యాక్టివ్ కావ‌డం లేదు. దీంతో మాట కు మాట కౌంట‌ర్ అన్న‌ది అంత వేగంగా అంద‌డం లేదు.

ముఖ్యంగా 3 రాజ‌ధానుల సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్న జ‌గ‌న్ కు నాటి బాబు నిర్ణ‌యాలు అస్స‌లు మింగుడు ప‌డ‌డం లేదు. గొంతుకు అడ్డం త‌గులుతున్నాయి. ఇదే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా ఉంది. జ‌గ‌న్ క‌న్నా వేగంగా బాబు ప‌నిచేయాల‌ని భావించినా కూడా వ‌య‌సు కార‌ణంగా కూడా కొంత వెనుక‌బ‌డి పోతున్నారు. ఇదే స‌మ‌యంలో సాయిరెడ్డి ట్వీట్లు కూడా కొంత ప్ర‌తిబంధ‌కంగానే నిలుస్తున్నాయి. విప‌క్షంలో కేవ‌లం లోకేశ్ ఒక్క‌రే ట్విట‌ర్ కౌంట‌ర్ ఇస్తున్నారు. శ్రీ‌కాకుళం ఎంపీ రామూ కూడా కాస్తో కూస్తో ట్విట‌ర్ లో యాక్టివ్ గా ఉన్నా కూడా వెంటవెంట‌నే కౌంట‌ర్లు ట్విట‌ర్ వేదిక‌గా ఇవ్వ‌డంలో వెనుకంజ‌లో ఉన్నారు. దీంతో సాయి రెడ్డి ట్వీట్లను వైసీపీ వ‌ర్గాలు బాగానే వైర‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా నాటి పాల‌న వైఫ‌ల్యాల‌ను సాయిరెడ్డి పేర్కొంటూ.. కుప్పంలో బాబు ప‌త‌నాన్ని విశ్లేషిస్తూ విడుద‌ల చేస్తున్న పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

అదేవిధంగా కొత్త త‌రం నేత‌లు కూడా బాబును బాగానే వెర్బ‌ల్ ఎటాక్ చేస్తున్నారు. ఇవ‌న్నీ కూడా బాబుకు త‌ల‌నొప్పిగానే ఉన్నాయి. ఐ టీడీపీ వింగ్ యాక్టివ్ అయితే కొంతలో కొంత సాయిరెడ్డి మాట‌ల‌కు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌డం సాధ్యం అయ్యే అవ‌కాశాలున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం త‌రఫున ఎన్టీఆర్ భ‌వ‌న్  (అమ‌రావ‌తి) కేంద్రంగా మాట్లాడుతున్న నేత‌లు
మ‌రింత స‌మ‌ర్థ రీతిలో గొంతుక వినిపిస్తే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి. ముఖ్యంగా వైసీపీ ర్యాగింగ్ కాస్త‌యిన త‌గ్గుతుంది. కానీ ఆ విధంగా మాట్లాడుతున్న వారిలో స‌మ‌ర్థ‌త లేని కార‌ణంగా కొంత వెనుక‌బాటు త‌ప్ప‌డం లేద‌ని ప‌సుపు ద‌ళాలుసైతం ఒప్పుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news