సంగారెడ్డిలో జగ్గారెడ్డికి కష్టమవుతుందా?

-

తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు…ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ఉన్న జగ్గారెడ్డి…ఎప్పుడు ప్రత్యర్ధులపై ఫైర్ అవుతారో..ఎప్పుడు సొంత పార్టీ వాళ్లపై ఫైర్ అవుతారో అర్ధం కాకుండా ఉంటుంది. కానీ తెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో జగ్గారెడ్డి ఒకరు. అలా మాస్ ఫాలోయింగ్ ఉన్న జగ్గారెడ్డి రాజకీయం గత కొంతకాలంగా అర్ధం కాకుండా ఉంది..కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలతో ఆయన ఈ మధ్య దూకుడుగా ఉండటం లేదు.

ఆ మధ్య రేవంత్‌పై తెగ ఫైర్ అయిపోయిన జగ్గారెడ్డి…రాహుల్ గాంధీతో భేటీ తర్వాత సైలెంట్ అయ్యారు. అదేమంటే దసరాకు సంచలన ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు..వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని…సంగారెడ్డి నుంచి కార్యకర్తలని గాని, లేదంటే తన భార్యని కూడా పోటీకి దింపుతానని చెప్పారు. ఇలా ప్రకటించిన వెంటనే…ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం జగ్గారెడ్డి పోటీ చేసేలా కనిపించడం లేదు. అలా అని తన ఫ్యామిలీకి కాకుండా ఒక కార్యకర్తకు సీటు ఇప్పించుకోవడం కష్టమే. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోదు. అదే సమయంలో జగ్గారెడ్డి అసలు కాంగ్రెస్‌లోనే ఉంటారనేది కూడా డౌట్ గానే ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటే సంగారెడ్డిలో గెలుపు ఈజీగా ఉండదు.

గత ఎన్నికల్లోనే 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు…ఈ సారి అక్కడ టీఆర్ఎస్ పాటు, బీజేపీ పుంజుకుంటుంది. మరి ఇలాంటి పరిస్తితుల్లో జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. గతంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే బీజేపీలోకి కూడా వెళ్ళి మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. అంటే రెండు పార్టీలతో జగ్గారెడ్డికి పరిచయాలు ఉన్నాయి. మరి జగ్గారెడ్డి చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news