9 ఏళ్ల బాలికపై లిఫ్టులో వృద్ధుడి అఘాయిత్యం

-

మహిళలు ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏదో ఒక సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. మహిళలను రక్షించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు, చట్టాలను అమలు చేస్తున్నారు.. అయినా కూడా కామాంధులలో ఎక్కడ మార్పు రాలేదు. ఎందరో మహిళలు పురుషాహంకారానికి బలై నూరేళ్ల జీవితాలను సగంలోనే ముగింపు పలుకుతున్నారు . కొందరు కామాందులు చిన్నపిల్లలు అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకుు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

అపార్ట్మెంట్లోని లిఫ్టులో ఓ 62 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల చిన్నారి మధ్యాహ్నం పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె అపార్ట్మెంట్లోని 11 అంతస్తులో ఉన్న తన ఇంటికి వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కింది. అదే సమయంలో జగత్పూర్ కు చెందిన నిందితుడు భాను ప్రతాప్ లిఫ్టులోనే ఉన్నాడు. బాలికని లిఫ్టులో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. లిఫ్టులోని సీసీటీవీ ఆధారంగా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదుు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు నిండుతున్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news