వాళ్లకు కేసీఆర్ గట్టి షాక్ ఇస్తారా…?

-

తెలంగాణాలో ఇప్పుడు తెరాస పార్టీ అధికారం నిలబెట్టుకోవడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఈ నేపధ్యంలోనే కొన్ని కీలక అడుగులు వేస్తుంది ఆ పార్టీ… పలువురు ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టె ఆలోచనలో కూడా సిఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ లో ఉన్న కొందరి ఇమేజ్ ని అర్ధం చేసుకున్న ఆయన మార్పులు చేసేందుకు రెడీ అయ్యారు. పలువురు నాయకులను కచ్చితంగా మారుస్తాను అని ఇటీవల అంతర్గత సమావేశాల్లో కూడా సిఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే… ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి సిఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంటుంది అని భావిస్తున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఆయన జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అయితే దాదాపుగా ఆరుగురిని మార్చేసే ఆలోచనలో ఉన్నారట. అదే విధంగా నల్గొండలో కూడా ఆయన ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఖమ్మం ను ఆనుకుని ఉన్న నియోజకవర్గాలలో మార్పులు చేయడానికి రెడీ అయ్యారట.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సిఎం కేసీఆర్ మార్పులకు సిద్దమయ్యారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు అధికార పార్టీకి కాస్త ఇది సమస్యగానే మారింది. ఇక బిజెపి విషయంలో కూడా ఆయన జాగ్రత్తగానే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించిన బిజెపి విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దనే భావనలో ఆయన ఉన్నారట. మరి ఇది ఎటువైపు వెళ్తుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news