‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం : చిరంజీవి

-

ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన ప్రజాకవి, గాయకుడు గద్దర్‌ ఇవాళ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే.. గద్దర్‌ మృతి పట్ల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అయితే.. గద్దర్‌ మృతిపై మెగస్టార్‌ చిరంజీవి స్పందిస్తూ.. ”వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం ! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యం లో, ప్రజా ఉద్యమాల లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది ఆయన అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం !’ అని ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలియజేశారు.

Singer and Indian Poet Gaddar to Act in Chiranjeevi Upcoming Movie - Sakshi

ఇదిలా ఉంటే.. ‘‘ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్తిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news