అగ్నిప‌థ్ : ఆ ఇద్ద‌రి నేత‌ల‌నూ అరెస్టు చేస్తారా ?

-

ఇప్ప‌టిదాకా ఎన్నో నిర‌స‌న‌లు జ‌రిగేయి.. జ‌రుగుతున్నాయి. అగ్నిప‌థ్ వ‌ద్ద‌ని చాలా మంది యువ‌త మొన్న‌టి వేళ దేశ‌వ్యాప్తం నిర‌స‌న‌ల‌తో త‌మ బాధ‌ను వెల్ల‌డిచేశారు. నిన్న కూడా భార‌త్ బంద్ కు పిలుపు ఇచ్చి త‌మ బాధ‌ను మ‌రోసారి చెప్పుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు. వీటిని త‌ప్పు ప‌ట్టాలా వ‌ద్దా అన్న‌ది కాదు కానీ అస‌లు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఎందుక‌ని ఉద్రిక్త‌త‌ల‌కు తావిచ్చి 4 ఓట్లు దండుకుంటున్నాయా అన్న‌ది ఓ ప్ర‌ధాన ప్ర‌శ్న సోష‌ల్ మీడియా నుంచి వ‌స్తున్న‌ది. ఈ కేసులో అమాయ‌క యువ‌కులు కొంద‌రు ఇరుక్కుపోయారు అని సికింద్రాబాద్ ఉదంతానికి సంబంధించి వివ‌రం అందుతోంది. రైల్వే ఆస్తులను ప‌రిర‌క్షించాల్సిన యువ‌తే ఈ విధంగా ఆగ్ర‌హంతో ఊగిపోయి, క‌ట్టుత‌ప్పి ప్ర‌వ‌ర్తించ‌డం వెనుక రెండంటే రెండు ప్ర‌ధాన పార్టీలున్నాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రి! ఆయా అగ్ర‌నేత‌ల‌ను అరెస్టు చేస్తారా?

ముఖ్యంగా నిన్న‌మొన్న‌టి నిర‌స‌న‌ల్లో ఎన్ఎస్యూఐ..ప్ర‌ధాన పాత్ర పోషించింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నిన్న కూడా ఢిల్లీలో క‌న్నాట్ ప్లేస్ వ‌ద్ద శివాజి బ్రిడ్జి  రైల్వే స్టేష‌న్లో రైలును యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కులు ఆపేశారు. అంటే ఇది నేరం కాదా ! ఓ న డుస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసును ఎలా ఆపుతారు ? ఏం హ‌క్కు ఉంద‌ని నిర‌స‌న‌ల‌కు ఉద్రిక్త రూపం అందిస్తున్నారు ? ఇవే పాల‌క ప‌క్షం నుంచి వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు.. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ శ్రేణుల గురించి కూడా మాట్లాడాలి.

మొన్న‌టి  రాకేశ్ అంతిమ యాత్ర‌లో నిర‌స‌న‌కారులు బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై రాళ్లు రువ్వారు. ఫ్లెక్సీలు చింపారు. మ‌రి !వీళ్ల పై కేసులు రాష్ట్ర ప్ర‌భుత్వ పోలీసులు న‌మోదు చేస్తారా లేదా ? అన్న‌ది ఓ పెద్ద సందేహంగానే ఉంద‌ని బీజేపీ అంటోంది. అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ కానీ ఇంకా చెప్పాలంటే రాహుల్ కానీ వీళ్లంతా త‌మ‌కు తాము ప్ర‌భుత్వ ఆస్తుల ప‌రిర‌క్ష‌కులు అన్న‌ది గుర్తు పెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news