తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా, నైరుతి రుతుపవనాలు విస్తరణ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి ఇవాళ బలహీన పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.