చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. ప్రధానమంత్రి నుండి పేదవాడి వరకు ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ఇప్పటికే కొంతమంది దేశ ప్రధానులకు మరియు మంత్రులకు ఈ వైరస్ సోకటం జరిగింది. దాదాపు భూమి మీద ఉన్న అన్ని దేశాలలో ఈ వైరస్ వ్యాపించి ఉంది. మందు లేని ఈ వైరస్ చైనా దేశంలో పుట్టడంతో అనేక అవస్థలు పడుతున్న వివిధ దేశాల ప్రజలు మరియు ప్రధాన మంత్రులు చైనా దేశాన్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు.ఇంత ప్రమాదకరమైన వైరస్ ప్రభావం గురించి ప్రపంచాన్ని అలర్ట్ చేయకుండా ఎందుకు చైనా వాళ్ళు వైరస్ వచ్చిన ప్రారంభంలో కామ్ గా ఉన్నారు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే చైనా దేశం తప్పు చేసినందువల్ల ప్రపంచం అంత అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో… తగిన మూల్యం చెల్లించాలి అని కోరుతున్నారు.
ఇలా అందరూ చైనా దేశానికి తిట్టుకుంటున్న తరుణంలో ప్రపంచానికి కాస్త ఉపశమనం ధైర్యం కలిగించే వార్త చైనా దేశం నుండి బయటకు వచ్చింది. అదేమిటంటే మొన్నటి వరకు చైనా దేశంలో ప్రతి రోజు మరణాలు సంభవించిన ఇటీవలనే అసలు ఎవరు కూడా వైరస్ వల్ల చనిపోయిన సందర్భం లేదని చైనా ప్రభుత్వం ధృవీకరించింది. దాదాపు మూడు నెలల తర్వాత చైనాలో ఇటువంటి పరిస్థితి రావడంతో… ప్రపంచ దేశాలకు ఈ వార్త కొంత ఉపశమనం మరియు ధైర్యాన్ని కలిగించింది.